సింగరేణి పనులలో డొల్లతనం…
లక్షల రూపాయల సంస్థ సొమ్ము నీళ్లపాలు…
నాసిరక పనులకు సహకరిస్తున్న కారకులు ఎవరు..?
నాసిరకం పనులపై సింగరేణి సిఎండి దృష్టి సారించాలి…
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 24:
నైనారపు నాగేశ్వరరావు ✍️
9121 463 468
మణుగూరు మండల పరిధిలోని కూనవరం రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కోడిపుంజుల వాగు పై సింగరేణి సంస్థ వంతెన నిర్మాణం చేశారు. ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉదృతంగా పెరగడంతో వరద పోటుకు వంతెన కుంగిపోయింది.గత సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇదే పరిస్థితి జరిగింది.సి-టైపు,పివి కాలనీ నుండి సింగరేణి అధికారులు,ఉద్యోగులు, కార్మికులు,పగలు రాత్రులు అనకుండా డ్యూటీ లకు వెళ్లే మార్గం మధ్యలో ఉన్నటువంటి కోడిపుంజుల వాగు వంతెన దాటి వెళ్లే పరిస్థితిలో ఉన్నాయి.గతంలో కార్మికులు విధులకు వెళ్లే సందర్భంలో వరద ఉధృతికి అనేక మంది ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కోడిపుంజుల వాగుపై సింగరేణి సంస్థ నిధులతో గత రెండు సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణం చేశారు.వంతెన నిర్మాణం నాసిరంకంగా నిర్మించడంతో మొదటి సంవత్సరంలోనే కుంగిపోయింది.వంతెన నిర్మాణ సమయంలో సింగరేణి అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే కారణం అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.సింగరేణి అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకంగా పనులు నిర్వహిస్తుంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.సింగరేణి అధికారుల అలసత్వమే వంతెన కుంగిపోవడానికి ప్రధాన కారణమని పలువురు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. కార్మికుల కష్టార్జితంతో వచ్చినటువంటి లక్షలాది రూపాయలను వివిధ నాసిరకం పనులను కాంట్రాక్టర్లతో చేపిస్తూ వారిచ్చే కాసులకు కక్కుర్తి పడి లక్షలాది రూపాయలను నీళ్ల పాలు చేస్తున్నారని కార్మికుల ఆరోపిస్తున్నారు. కోడిపుంజుల వాగు వంతెనపై ఎప్పుడు ఏమి జరుగునో నని కార్మికులు భయాందోళనకు గురౌతున్నారు.నాసిరక పనులకు సహకరిస్తున్న కారకులు ఎవరో తేలాలని పలువురు ఆరోపిస్తున్నారు.మణుగూరు సింగరేణి ఏరియాలో జరిగిన,జరుగుతున్న పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సింగరేణి సిఎండి ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.