అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కొట్టేందుకు యత్నం..
నేటి గదర్ న్యూస్ , జులై 24 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఆయన చేస్తున్నది ఉద్యోగం ప్రభుత్వ ఆసుపత్రిలో .. ఆసుపత్రికి వచ్చే పేషంట్ తో ఎప్పుడు దురుసుగానే ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతాడు.. అవసరం అయితే కూర్చున్న కుర్చీలో నుండి లేచి కొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తాడు.. ఇదంతా ఎవరి గురించి అంటే కూసుమంచి మండల కేంద్రంలో ఓపీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి గురించి.. ఈరోజు (మంగళవారం) ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఓ పేషంట్ ఓపీ రాస్తున్న ఆ సిబ్బందిని ప్రధాన డాక్టర్ గురించి అడుగుతాడు.. అంతే తొక తొక్కిన పాములా బుసలు కొడుతూ సదరు సిబ్బంది అసలు ఎవరు నువ్వు.. ఏం కావాలి.. అంటూ పేషంట్ పై దురుసుగా ప్రవర్తించాడు.. డాక్టర్ గురించి అడిగిన పాపానికి సహనం కోల్పోయిన ఆ సిబ్బంది కూర్చున్న కుర్చీలో నుండి లేచి పేషంట్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు.. ఇదే విషయంపై పేషంట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి కి చరావణి ద్వారా పిర్యాదు చేయగా చారావణి లో మాట్లాడుతుండగా కూడా కనీసం ఓపీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి తన పై అధికారి చరావణిలో ఉన్నారు అనే భయం కూడా లేకుండా పేషంట్ పై దురుసుగా మాట్లాడడం ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి కూడా వినడం కొసమెరుపు.. సదరు సిబ్బంది ప్రవర్తనకు అక్కడికి వచ్చిన పేషంట్స్ , ఆసుపత్రి సిబ్బంది కూడా అసహనం వ్యక్తం చేశారు..అయిన తన దురుసు ప్రవర్తన మార్చుకోకుండా పేషంట్ నీ దబాయించడం అక్కడికి వచ్చిన వారు నిర్వేరిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదలు.. కానీ అలాంటి వారిపై కనీసం జాలి చూపకుండా దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా చూస్తున్నారు…. ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్స్ దురుసుగా ప్రవర్తించిన ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా సిబ్బంది తీరు లేకపోవడం గమనార్హం.. వెంటనే ఆ ఓపీ విభాగంలో వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం..