జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్
తేది 24-7-2024.
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ కి సంబందించిన ఓ కేసులో పట్టణ పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుళ్లు నీరుడి రాము మరియు యం.రవి అనే ఇద్దరు కానిస్తేబుళ్లు ఓ కేసుకు సంబందించి ఫిర్యాదుదారుడి వద్ద నుండి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు రాగా అట్టి ఫిర్యాదును విచారించి నిజమని తేలడంతో వారి ఇద్దరినీ ఈ రోజు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ గారు తెలియజేశారు. జిల్లా సిబ్బంది ఎవరు కూడా జిల్లాకు మరియు పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెచ్చేలా చేయకూడదని అలా ఎవరైనా చేస్తే వారిపై శాఖ పరమైన చర్యలు ఉంటాయని అన్నారు.
Post Views: 97