రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 24:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్ ఆదేశాల మేరకు బుధవారం రోజు ఉదయం సీజనల్ వ్యాధులు పట్ల హోటలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ పరిశుభ్రత పాటించని హోటల్లో యజమానులకు జరిమానా విధించడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలిపారు.పట్టణంలోని గాయత్రి మెస్ హోటల్,నూర్ బ్లూ డైమండ్ బాలాజీ మహావీర్ స్వీట్స్, ఎస్ఎఫ్ ఫాస్ట్ ఫుడ్,బాలాజీ శ్రీరామ్ స్వీట్స్ లక్ష్మీ శ్రీరామ టిఫిన్ శ్రీ బాలాజీ స్వీట్,శ్రీ లక్ష్మీనరసింహ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీ చేసి హోటళ్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత పాటించని హోటల్ యాజమానులకు జరిమానాలు 13 వేల రూపాయలు విధించడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని హోటల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రజలకు ప్రబల కుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోటల్ యజమానులకు మున్సిపల్ అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు ఎన్.శ్రీనివాస్ శివరాజ్,వెంకట స్వామి, కర్ణాకర్,ఎల్లయ్య,రాజశేఖర్, రవీందర్,సైదయ్య,నవీన్ శంకర్,రాజు తదితరులు పాల్గొన్నట్లు తెలియపరచారు.