రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 24:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ స్థానిక విలేకర్లతో బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించపోవడం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం.మల్లు భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లి మోదీ ని నిధులు కేటాయించాలని అడిగినా మోడీ సర్కారు తెలంగాణా పై దయ చూపలేదన్నారు.తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తుందని పేర్కొన్నారు.బడ్జెట్ లో రాష్ట్ర ప్రాజెక్ట్ లకు మొండి చేయి చూపిందని కేంద్రం తెలంగాణా పై వివక్ష చూపుతుందని తెలిపారు.రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణాకు బడ్జెట్ కేటాయించకపోవడం పై ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు.తెలంగాణా పై బీజేపీ ఎంపీలకు ప్రేమ ఉంటే కేంద్రంతో కొట్లాడి తెలంగాణా కు నిధులు తేవాలని కోరారు. లేకపోతే రాజీనామా చేయాలని మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో నిధులు మల్లించుకుంటుంటే మన రాష్ట్ర బీజేపీ ఎంపీలు అసలు ఏమి పట్టించుకుంటున్నారని చివరికి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.