+91 95819 05907

అధికారం ఉందని అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్ జిల్లా)

టేక్మాల్ మండలం షాబాద్ తండా లో పట్టాలున్న గిరిజనులపై దాడి.
పోలీసులు కండువాలు లేని కార్యకర్తల్లావ్యవహారిస్తున్నారు.
బిఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడుతామంటూబెదిరిస్తున్నారు
సర్వే చేసి బాధితులకి న్యాయం చేయాలి.దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి విజ్ఞప్తి.
మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గిరిజనును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
మెదక్ జిల్లా
అందోల్ నియోజకవర్గం లో అధికారం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు.టేక్మాల్ మండలం షాబాద్ తండా లోని సర్వే నంబర్ 86లో 360 ఎకరాల భూమి ఉందని దింట్లో 150 ఎకరాల్లో పెట్టాలివ్వగా మిగితా భూమిని గిరిజనలు సాగుచేసుకుంటున్నారన్నారు.సాగు చేసుకుంటున్న రైతులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దౌర్జన్యానికి పాల్పడి గిరిజనులపై దాడి చేశారన్నారు. బాధితులతో కలిసి మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు.అనంతరం చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతల దాడిలో గిరిజనులు ప్రాణాపాయ స్థితిలో మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో బుజ్జి,యమున, ప్రమీల లు తీవ్రంగా గాయపడి అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.భూమిని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడి హత్యాయత్నం కు పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు.ఇంత జరిగిన నిందితులపై చర్యలు తీసు కోకుండా బిఆర్ఎస్ శ్రేణులపైనే కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రి దామోదర్ అండతో కాంగ్రెస్ శ్రేణులు విర్రవిగుతున్నారని విమర్శించారు.అందోల్ నియోజకవర్గం లో పోలీసులు కండువాలు లేని కార్యకర్తల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.బిఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడుతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని విమర్శించారు.భూ తగాదాలుంటే సర్వే చేసి బాధితులకి న్యాయం చేయాల్సింది పోయి అధికార పార్టీకి చెందిన వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు వాస్తవ విషయాలు తెలుసుకొని న్యాయం చేయాలనీ అయన కోరారు.అనంతరం మెదక్ జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గిరిజన మహిళలను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అయన వెంట టేక్మాల్ ఎంపిపి స్వప్న రవి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బత్తుల వీరన్న
ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు మహేందర్ తోపాటు షాబాద్ తండా గిరిజనలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !