★అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిది మెదక్)
*వసతిగృహాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి*
*తూనికల కొలతల అధికారులు తప్పనిసరిగా వేయింగ్ మిషన్స్ తనిఖీ చేయాలి*
*జిల్లా పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు*
జిల్లాలో పౌరసరఫరాల నిత్యవసర వస్తువుల సరఫరా, పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
బుధవారం అదరపు కలెక్టర్ రెవిన్యూ చాంబర్లో జిల్లా పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పంపిణీ జరుగుతున్న పిడిఎస్ కార్డు యొక్క వివరాలు మరియు క్వాలిటీ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వసతి గృహాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని క్షేత్రస్థాయిలో సమస్యలను ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా రేషన్ షాపులో ఉన్న ప్రతి వేయింగ్ మిషన్ తనిఖీ చేసి మరియు ఎక్కడైనా తేడాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐసిడిఎస్ కు నాణ్యత బియ్యం డెలివరీ చేయాలని టెక్నికల్ అసిస్టెంట్లచే ప్రతినిత్యం క్వాలిటీ చెక్ చేయించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, డిఎం సివిల్ సప్లై హరికృష్ణ, డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు, జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మాజీ, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, షెడ్యూల్ కులాల అధికారి విజయలక్ష్మి, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.