★చండ్రుగొండ మండల బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్
నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట ప్రతినిధి:ఎమ్మెల్యే సార్ గ్రామాల్లో ఉన్న సమస్యపై దృష్టి పెట్టండి అని BJP చండ్రుగొండ మండల పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ కోరారు. చంద్రుగొండ మండలం పోకలగూడెం పంచాయితీ పోకలగూడెం గ్రామంలో ప్రధాన సెంటర్ రైస్ మిల్లు సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉంటున్న పట్టించుకొనే నాథుడు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చాడు. గ్రామస్థులు అనేకసార్లు అధికారు లకు ఫిర్యాదు చేసిన సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకో కోక పోవడం అనేది బాధకరం అన్నారు. ఇదే కాదు రేషన్ షాప్ వద్ద బాల్య తండా స్కూల్ కు వెళ్లే దారి విషయంలో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవేమి పట్టనట్టు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతూ ప్రదర్శనలు చేస్తుంటే గ్రామాల సమస్య మీద తిరుగుతున్నారు సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలు కానీ ప్రజల సమస్యలు వాళ్లకి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు .ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి గ్రామాలలో ఉన్న సమస్యలను తీసుకెళ్లే దాంట్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారని BJP పార్టీ చంద్రుగొండ మండల నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను లు ఆరోపించారు.ఎమ్మెల్యే గత ప్రభుత్వం లో వచ్చిన చెక్ లను పంపిణీ చేయటంలోనే 8 నేలలు పూర్తి చేసారని గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.