◆విష్ణు మృతికి కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని– సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.
◆ఎంతో భవిష్యత్ ఉన్న విష్ణు మృతి భాదకరం
పాల్వంచ: ఇంటర్ విద్యార్థుల మూకముడి దాడిలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థి అల్లూరి విష్ణు మృతదేహాన్నికి సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం ఆదివారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. విష్ణు మృతికి కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. ఎంతో భవిష్యత్ ఉన్న విష్ణు మృతి భాదకరంని, కుటుంబానికి సీపీఐ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్ రావు, దార శ్రీనివాస్, వైఎస్ గిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్కా అజిత్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల సృజన, ప్రారిపర్తి రాజు, sk లాల్ పాషా, జిలానీ, అశోక్ తదితరులు ఉన్నారు.