రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మైనంపల్లి వాణి హనుమంతరావు హాజరయ్యారు.ఆదివారం రోజు పట్టణంలోని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రామచంద్రం గౌడ్, చౌదరి సుప్రభాత రావు,రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటేష్,సుంకోజు దామోదర్, విప్లవ్ కుమార్,యెనిశెట్టి అశోక్, ఎర్రం సత్యం,బైరం శంకర్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
