+91 95819 05907

వికలాంగుల కార్పొరేషన్ శాఖ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై ఖండన

– టి.ఆర్.వి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ మున్నా

నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో (జూలై 29);

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చల్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆసరా పెన్షన్ల గురించి అడగగా అందుకు మంత్రి సీతక్క ఆసరా పెన్షన్ల గురించి చెప్పకుండా అసెంబ్లీలో మాజీ వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టి. ఆర్. వి. ఎస్. రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ మున్నా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నాడు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చలలో మాజీ మంత్రి హరీష్ రావు ఆసరా పెన్షన్లు దివ్యాంగులకు సరిగా రావడం లేదు పెన్షన్లు పెంచి ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ శాఖ మంత్రి సీతక్క ఆసరా పెన్షన్ల గురించి చెప్పకుండా సభను, చర్చను, తప్పుదోవ పట్టిస్తూ అసెంబ్లీలో వాసుదేవ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి పోలియో సోకి దివ్యాంగుడిగా పుట్టడమే ఆయనకు శాపమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుడై ఉండి రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో చూసి ఓర్వలేక తనపై కాంగ్రెస్ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని వాసుదేవ రెడ్డి ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారని వాసుదేవరెడ్డి ఒక విద్యార్థి నాయకునిగా గతంలో కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి అనేకసార్లు జైలు పాలై కేసుల పాలై ఇబ్బందులు ఎదుర్కున్నారని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లిన చరిత్ర ఆయనకు ఉందని, ఆయన చైర్మన్ కాకముందు నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి దివ్యాంగుడిగా పెన్షన్ తీసుకుంటున్నాడని రాష్ట్ర ప్రభుత్వానికి ఆసరా పెన్షన్లు సరిగా ఇవ్వడం చేతకాక కొత్తగా పెంచి ఇస్తామని చెప్పి పెన్షన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతుందని మున్నా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాను చైర్మన్ గాఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో మాట్లాడి దివ్యాంగుల పెన్షన్ 3000 రూపాయలకు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి పెంచడంలో వాసుదేవరెడ్డి కృషిని వికలాంగ జాతి మరిచిపోదని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వాసు దేవరెడ్డి అని అన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం లో వాసుదేవరెడ్డి ముఖ్యమంత్రి సహకారంతో దివ్యాంగుల సంక్షేమానికి దాదాపు పదివేల కోట్లకు పైగా ఖర్చుపెట్టిన చరిత్ర ఆయనకు ఉందని కార్పొరేషన్ చైర్మన్ గా తనకు వచ్చే గౌరవ వేతనాన్ని కూడా దివ్యాంగుల సమాజానికి ఖర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి పై ప్రజా సమస్యల గురించి మీడియాలో చర్చల్లో గొంతు విప్పుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని రాజకీయ కుట్రకు పాలు పడుతుందని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు ఆయన భయపడే వ్యక్తి కాదని సీతక్క ఆరోపణలు చేస్తే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని ఇతరుల మీద బురద చల్లే ముందు ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదాలో సీతక్క ప్రభుత్వంలో నిజాయితీ గానే పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ మంత్రిగా ఉండి అందులో పెన్షన్ల శాఖ మంత్రిగా ఉంటూ మీ కుటుంబంలో మీ తండ్రి జగ్గయ్యపేట గ్రామంలో ధనసరి సమ్మయ్యకు ఆసరా పెన్షన్ నెలకు 2016 ఎలా తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. అంతేకాకుండా వాళ్ళ తండ్రి మీద ఒక ఎకరం 17 గుంటల భూమికి పోడు పట్టా పాస్ పుస్తకాన్ని 13 జూలై 2023లో ఎట్లా తీసుకున్నారని అడిగారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ పథకాలు వారి కుటుంబ సభ్యులు తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. కాబట్టి ఒక్కసారి సీతక్క మీరు ఆలోచన చేయండి అన్నారు. వాసుదేవరెడ్డి ఒక విద్యార్థి దశ నుండి వచ్చిన మంచి నేత అని రాజకీయాల్లోకి వచ్చారని శారీరక వికలాంగుడిగా అనేక కష్టాలు పడి అవమానాలు అవహేళనలు ఎదుర్కొని రాజకీయాలలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అతనిని చైర్మన్ గా చేసిన కాలం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని చైర్మన్ గా లేని నాటినుండి తనకు పెన్షన్ వస్తుందని ఆయన ఒక సందర్భంలో చెప్పారని చైర్మన్ కాగానే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయా ?అని ప్రశ్నించారు మున్నా. రాజకీయాల్లో పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఏదో సాధించాలని దృక్పథంతో చేస్తున్న పనులు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక దివ్యంగుడిగా రాజకీయాల్లో స్థానం సాధించే వారే తక్కువ సాధించే వారిని సహకరించాలని సీతక్కకు ఉపదేశించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !