★ఏ మాత్రం అలసత్వం చేయకుండా భారీకేడ్ల ఏర్పాటు
★పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్న వివిధ కాలనీల వాసులు
నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో (జూలై 30);
అన్నోజిగూడ ఎన్ టి పి సి రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ రాసిన కథనం/వార్తపై కదిలిన అధికార యంత్రాంగం వెంటనే స్పందించి భారీ కేడ్లు ఏర్పాటు చేసినందుకు చుట్టుపక్కల కాలనీవాసులందరూ అధికారులకు మరియు పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించే యంత్రాంగం ఉన్నంతవరకు ఎటువంటి సమస్య తలెత్తదని ప్రజానికం ఆనందంలో మునిగిపోతుంది.
Post Views: 211