తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా DYFI-SFI ఆధ్వర్యంలో డ్రక్స్, మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు..
నేటి గదర్ న్యూస్ August4:వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాస రావు.
కామేపల్లి:సమాజ మార్పుకై విప్లవ సాధనలో నిజమైన స్నేహితులుగా కలిసి ప్రయాణించిన చేగువేరా,కాస్ట్రో,భగత్ సింగ్ సహచరుల స్నేహన్ని నేటి స్నేహితులు ఆదర్శంగా తీసుకోవాలనీ, అసెంబ్లీలో ఉద్యోగాల ఖాళీలతో కూడిన లెక్కలతో సహా స్పష్టమైన నిరుద్యోగ క్యాలెండర్ నీ ప్రకటించాలనీ, రెండు లక్షల ఉద్యోగాలను ప్రకటించాలని DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ డిమాండ్,
స్థానిక కామేపల్లి గుండా.బిక్ష్మారెడ్డి భవన్ లో DYFI కామేపల్లి మండల కమిటీ సమావేశం మండల నాయకులు రాంబాబు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి స్నేహితులు జీవితంలో వచ్చే సమస్యలను, అభివృద్ధిలో కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని సమాజ అభివృదిలో భాగస్వామ్యం కావాలని అన్నారు.అలా సమాజ మార్పుకై విప్లవ సాధనలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజమైన స్నేహితులుగా కలిసి ప్రయాణించిన చేగువేరా,కాస్ట్రో,భగత్ సింగ్ సహచరుల స్నేహన్ని నేటి స్నేహితులు ఆదర్శంగా తీసుకోవాలనీ ఆయన పిలుపునిచ్చారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగ క్యాలెండర్ అస్పష్టంగా ఉందని, మొత్తం ప్రభుత్వ శాఖలలో ఖాళీల లెక్కలను ఉద్యోగ క్యాలెండర్ లో ఎక్కడా చూపించలేదనీ, వెంటనే మరల అసెంబ్లీలో, ఉద్యోగాల ఖాళీలతో కూడిన లెక్కలతో సహా స్పష్టమైన నిరుద్యోగ క్యాలెండర్ నీ ప్రకటించాలనీ, రెండు లక్షల ఉద్యోగాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశాడు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉపేందర్,నరేష్,సురేష్, ప్రవీణ్,సాయి తదితరులు పాల్గొన్నారు.