నేటి గదర్ న్యూస్August5:వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు
వైరా: వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆగస్టు15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ రైతాంగ సదస్సు లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. వైరా లోని తుళ్లూరు కోటేశ్వరరావు పామాయిల్ తోట సమీపంలో వ్యవసాయ రైతాంగ సదస్సు ఏర్పాటు చేసేందుకు, అవసరమైన
బహిరంగ సభ స్థలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,రెవెన్యూ అధికారులు,ఏసిపి రహమాన్, సిఐ సాగర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి
ప్రారంభిస్తారు అని మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రుణమాఫీ సంబరాలు వైరా లో జరుపుతామని స్పష్టం చేశారు.
రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు, ఈ సభకు లక్ష మంది పైగా రైతులు ప్రజలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్పెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతగాని జైపాల్, కాంగ్రెస్ నాయకులు కట్ల రంగారావు, దొడ్డ పుల్లయ్య, మచ్చ బుజ్జి, పణితి శ్రీను, దార్నా రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు అభిమానులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు.