★వరంగల్ కు దక్కిన గౌరవం
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన రూహీ నబీల తెలంగాణ హై కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నిమియించనట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్ననాటి నుండే న్యాయవాద వృత్తిపై మక్కువతోనున్న రూహీ ఇంటర్ వరకు హన్మకొండలో చదివి, ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో చదివి ఉతీర్ణురాలైంది. తన తండ్రి మహమూద్ వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసారు. తండ్రి బాటలో నడిచి తండ్రిని మించిన తనయ లాగా 2016 లో తెలంగాణ బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా మొదట వరంగల్ కోర్టులో పని చేసి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో తన ప్రాక్టీసు మొదలు పెట్టింది. రూహీ క్రమశిక్షణ, పని విధానం చూసిన తెలంగాణ ప్రభుత్వం తనను ఎజిపి గా నియమించింది. చిన్న వయస్సులోనే ఎజిపి సాధించిన రూహీ నబీలాకు మంచి భవిషత్ ఉంది. నా యొక్క విధులలో ఎలాంటి పక్షపాతం, తారతమ్యం లేకుండా నిర్వహిస్తానని, నా పట్ల నమ్మకంతో బాధ్యత అప్పగించిన న్యాయ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు రూహీ ధన్యవాదాలు తెలిపారు