నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మంలో హల్ చల్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు. ఆహార తనిఖీ అధికారులమంటూ ఖమ్మం నగరంలోని కింగ్ దర్బార్ హోటల్ లో ఆకస్మిక తనిఖీ చేశారు.కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్ అయ్యారు.ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హోటల్ యజమానిని బెదిరించినా వైనం. మీహోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని హైదరాబాద్ నుంచి తమను ఆకస్మిక విచారణ చేయమని చెప్పిన కేటుగాళ్లు, విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రెండులక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా కలెక్టర్, సీసీ, జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు తలా యాభైవేలు ఇవ్వాల్సి ఉంటుందన్న ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్థానిక ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు . తమ శాఖ నుంచి ఖమ్మం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఏమీ లేవని స్పష్టం చేసిన జిల్లా స్థాయి ఆహార తనిఖీ అధికారి కిరణ్ కుమార్.కేటుగాళ్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన హోటల్ యజమాని జుబేర్ ఖాన్.