నేటి గద్దర్ న్యూస్ మధిర నియోజకవర్గ ప్రతినిధి వెంకటేష్ సుంకర. జాలిముడి ప్రాజెక్టులో మృతదేహం నీళ్లలో ఉండగా చుట్టుపక్కల రైతులు గమనించి మధిర రూరల్ పోలీసులకు తెలియజేయగా వెంటనే స్పందించిన రూరల్ ఎస్సై లక్ష్మిభార్గవి డ్యూటీలో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ కోట ధర్మ మరియు ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని అతి కష్టం మీద మూడు రోజుల క్రితం చనిపోయి 20 అడుగుల లోతు లో ఉన్న మృతదేహాన్ని తాడు ద్వారా తీసుకుని పైకి ఓడ్డు మీదకు చేర్చి చుట్టుపక్కల వారికి మృతదేహాన్ని చూపించగా..వైరా మండలం లింగన్నపాలెం గ్రామానికి చెందిన బోళ్ళ కృష్ణ 55 సంవత్సరాల వ్యక్తి నాలుగు రోజుల నుంచి కనిపించకపోవడంతో సమాచారం అందుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కృష్ణ మృతదేహంగా గుర్తించడం జరిగింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే జాలిముడి ప్రాజెక్టులో మృతదేహాన్ని వెలికి తీయడం సాధారణ విషయం కాదని అంతటి సాహసోపేతమైన పని పుట్టినరోజు నాడు కూడా బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వహించిన కానిస్టేబుల్ కోట ధర్మను ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణను హోంగార్డ్ మన్నేపల్లి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగ్గుల కృష్ణారెడ్డి ని ఉన్నతాధికారులు గ్రామస్తులు అభినందించారు.