చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతికి నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్ చేయాలి…
ఆదివారం నాడు చర్ల మండలం కొయ్యురు గ్రామంలో జిఎస్పీ(GSP) అత్యవసర సమావేశంలో జిఎస్పీ(GSP) చర్ల మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పూనేం. వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న ఆదివాసి విద్యార్థి కుంజ దీపక్ మృతికి కారణం అయినటువంటి, ఆశ్రమ పాఠశాల సిబ్బంది భాద్యత వహించాలని అని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయలు వేతనాలు తీసుకుంటూ ఆదివాసి విద్యార్థి మృతికి కారణం అయ్యారని,ఆ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఓ ఆదివాసి బిడ్డ మృతి చెందారని,ప్రభుత్వం కుంజ.దీపక్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ(ITDA) విద్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఈ మరణం సంభవించిందని, ప్రతినెల ఐటిడిఏ (ITDA)పరిధిలోని ఆశ్రమ పాఠశాలలను అధికారులు సందర్శించాలని.ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కోరం. ముత్యాలు ,ఇర్ప. అరుణ్ ,సోడి. అనిల్ తదితరులు ఉన్నారు