చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
భద్రాచలం డివిజన్ పరిధిలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8 వతరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణమైన పాఠశాల హెచ్ఎం తో పాటు సరైన పరిశీలన చేయ లేనటువంటి జిల్లా అధికారిని
డిడి లను తక్షణమే సస్పెండ్ చేయాలని.పి వై ఎల్(PYL) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి. సతీష్ PDSU, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్ప రాజేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలుగురు విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా ఆశ్రమ పాఠశాల నుండి బయటకు ఎలా వచ్చారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు బయటికి వెళ్లిన కొన్ని గంటలపాటు గుర్తించకుండా, పరిశీలన చేయకుండా నిర్లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు ఉండడం మూలంగానే ఇలాంటి దుర్ఘటన జరిగి విద్యార్థి మరణానికి కారణం అయిందని వారు అన్నారు. విద్యార్థుల రక్షణ కోసం, విద్యార్థుల యోగక్షేమాలు కాపాడుతారని లక్షల రూపాయలు ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంటే పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రధానోపాధ్యాయులు మాత్రం బాధ్యతారాహిత్యంతో ఉంటూ విద్యార్థులు ఎటు పోతున్నారో కనీసం పరిశీలన చేయకుండా ఉండడంతో గిరిజన ఆశ్రమాలలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని దీనితో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరణించిన కొత్తపల్లి పాఠశాల విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ముసలి సతీష్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న నరసరావు గొందిగూడెం,చర్ల,ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో పనిచేసి అనేక నిర్వహణ వైఫల్యాలు చెంది అనేక ఆరోపణలతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అనేక సందర్భాలు అధికారుల ముందు ఉన్నాయని అయినా శాఖ పరమైన చర్యలు తీసుకోకూడా ఆయనకు అనేక బాధ్యతలు ఇచ్చి గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు అన్నారు. గిరిజన ఆశ్రమాలకు ప్రత్యేక పరిశీలనాధికారిగా నియమించబడిన డిడి అధికారి ఏమాత్రం పరిశీలన చేయకుండా రహస్యంగా రాత్రి సమయాలలో పాఠశాలలను తనిఖీల పేరుతో సందర్శించి కేవలం ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ లను మాత్రమే కలిసి విద్యార్థుల యోగక్షేమాలు, చదువు,క్రమశిక్షణ గురించి పట్టించుకోకుండా విద్యార్థులతో మాట్లాడకుండా వారి సమస్యలు తెలుసుకోకుండా మెతక వైఖరితో ఉండడం మూలంగా అలుసుగా తీసుకున్న ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ లు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని దీని మూలంగా గిరిజన విద్యార్థులపై తీరమైన ప్రభావం పడుతుందని వారు అన్నారు. తక్షణమే ఐటీడీఏ పీవో చొరవ తీసుకొని విద్యార్థి మరణానికి కారణమైన హెచ్ఎం,డిడిలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలు యువజన ఉద్యమాలు ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్(PYL) మండల నాయకులు కారం సురేష్,కొరస,రాము,రమేష్ సుధీర్, బాలు విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.