★లిఫ్ట్ లు ఇస్తున్నారా జాగ్రత్త సుమీ
★యమపాశంగా మారుతున్న చీరలు. చున్నీలు. బుర్కాలు
★రన్నింగ్ బైక్ బ్యాక్ వీల్ లో ఇరుక్కున్న చీర.. కిందపడి మహిళకు తీవ్ర గాయాలు
★ముదిగొండ మండలంలో 2 నెలల్లో ఇలాంటివి 3 సంఘటనలు
★డాక్టర్లు,పోలీసులు ప్రజలకి అవగాహన కల్పించాలి స్థానికులు
నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల పరిధిలోని అయ్యాగారిపల్లి గ్రామానికి చెందిన మహిళ గంధసిరి నుంచి వనంవారి కిస్టాపురం వెళ్తున్న టూ వీలర్ లిఫ్ట్ అడిగి ఎక్కింది మార్గం మధ్యలో కమలాపురం దాటిన తరువాత ప్రమాదవశాత్తు రన్నింగ్ బైక్ బ్యాక్ వీల్ లో చీర ఇరుక్కొని మహిళ తలకు, కుడి మోచేతికి, కాలికి బలమైన గాయం తగలడంతో ఆ మహిళను వెంటనే హుటాహుటిన ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మెడలో ఉండే చున్నీలు యమపాశాలు గా మారుతూ ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని బైక్ పై ప్రయాణించేటపుడు మహిళలు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవాలని బైకులకు కూడా చైన్ గార్డ్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. చున్నీ, చీర, బుర్కా వంటివి వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలని అంటున్నారు.. ముఖ్యంగా చీర కట్టుకున్నప్పుడు, చున్నీ వేసుకున్నప్పుడు,బుర్కా వేసుకున్నప్పుడు బైక్ వెనుక టైర్లో ఇరుక్కోకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు. లేదంటే దుస్తులు టైర్లో ఇరుక్కుంటే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు గురవుతామంటున్నారు. కాబట్టి బైక్ పై ప్రయాణించేటపుడు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకుని బట్టలు టైర్లో ఇరుక్కోకుండా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి బైక్ పై వెళ్లే అప్పుడు చాలా సేఫ్ గా ఉండాలంటున్నారు.