నేటి గదర్ న్యూస్ ఆగష్టు11:వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు.
వైరా : వైరా మండలం, గన్నవరం గ్రామంలో బహుజన అభ్యుదయ సేవా సమితి ఆశ్రమం లో ఆదివారం వృద్దులకు మధ్యాహ్న భోజనాన్ని అందించినారు. ఈ కార్యక్రమం గత 6 నెలలుగా స్థానికంగా నివాసం ఉంటున్న వృద్దులకు ప్రతి వారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ఆదూరి మణి తెలిపారు.ఈ భోజనానికి అయ్యే ఖర్చులను కొంతమంది దాతల నుండి సేకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఇక్కడకు భోజనం చేయడానికి వచ్చే వృద్దులు నిరుపేదలు మరియు ఒంటరిగా జీవనాన్ని గడిపేవారు అని గుర్తించి వారికి ప్రతివారం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ లో ప్రతి రోజు నిర్వహించే విధంగా ప్రణాళిక వేస్తున్నామని, ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక లంచ్ బాక్స్ ని వారి ఇండ్లకే తీసుకుని వెళ్లి వారికి అందిస్తామని తెలిపారు. అందుకు కావాల్సిన ఫండ్స్ దాతల ద్వారా సేకరించి దాతల సమక్షంలోనే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సహాయం చేయాలనే ఆసక్తి గలిగిన దాతలు మమ్మల్ని సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమానికి డబ్బులే ఇవ్వనక్కరలేదు కావలసిన సరుకులను కూడా అందించవచ్చని అన్నారు.