నేటి గదర్ న్యూస్,చర్ల:
కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి మరణానికి కారణమైన అసలు కారకున్ని వదిలేసి ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి సహాయకుడిగా ఉన్న వార్డెన్ పై చర్యలు తీసుకొని ఐటిడిఏ అధికారులు చేతులు దులుపుకున్నారని పి డి యస్ యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్ అన్నారు. ఆదివారం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గిరిజన శాఖలో డిడి స్థాయి జిల్లా అధికారినే అసమర్థతగా ఉండడంతో జిల్లా లో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ లు కొందరు ఉపాధ్యాయులు నియమ నిబంధనలు తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ఉంటున్నారని వారి నిర్లక్ష్యం కారణంగా గిరిజన విద్యార్థులు నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, కొందరు లైంగిక వేధింపులకు గురి కావడం, మరికొందరు విద్యార్థినీలు అవమానాలు భరించలేక సూసైడ్ అగాయిత్యాలకు పాల్పడుతున్న దుస్థితి ఆశ్రమ పాఠశాలలలో కనబడుతుందని, కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు సమయానికి విధులకు హాజరుకాకుండా రియల్ ఎస్టేట్ భూదందా, ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారానికి పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తికి అవమానకరంగా వ్యవహరిస్తున్నా వీటిని నియంత్రించడంలో అధికారుల వైఫల్యాలు కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన శాఖ ఆశ్రమ పాఠశాలలలో పేర్కొని ఉన్న లోప భూష్టతలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో పర్యవేక్షణ చేసి గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మరణం పట్ల జరిగిన నిర్లక్ష్యపు ప్రధానోపాధ్యాయుడిని కాపాడేందుకే గిరిజన శాఖ జిల్లా అధికారిని తీవ్ర ప్రయత్నం చేసి కేవలం సోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరడం సరైనది కాదని కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఇప్పటికే అనేక సోకాజ్ నోటీసులు ఇచ్చి ఉన్నారని అయినా తనలో ఏమాత్రం మార్పు లేకుండా అనేక తప్పుడు పద్ధతులకు పాల్పడుతూ గిరిజన శాఖ ప్రతిష్టలను దిగజార్చుతున్నాడని అనేక సందర్భాలలో తనపై వచ్చిన అభియోగాలే అందుకు నిదర్శనమని వారు అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారిని పారదర్శకంగా పరిశీలన చేసి పిఓ లాంటి అధికారికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా వాస్తవ విషయాలని, రిపోర్టును ప్రాజెక్ట్ అధికారి పిఓ కు తెలిపి కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థి మరణానికి కారణమైన ప్రధానోపాధ్యాయుడు,వార్డెన్ మరియు వాచ్మెన్ ను సస్పెండ్ చేసి మరణించిన విద్యార్థి కుటుంబానికి ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గట్టుపల్లి తులసి రామ్, అల్లం సంజు, ఇర్ప నాగేంద్ర, తెల్లం శరత్, వాసం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.