నేటి గదర్ న్యూస్, నగర్ కర్నూల్
భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నాడ్ద పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమ జిల్లా సమావేశాన్ని ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ నీరుకంటి రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని పెంపొందించాలన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రజలు ఈ జాతీయ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని పిలుపునివ్వడం, ప్రజల్లో దేశభక్తి తో ఉప్పొంగా అన్నారు. అనంతరం హర్ ఘర్ తిరంగ కార్యక్రమం పార్టీ పిలుపుమేరకు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయాలని పిలుపునివ్వగా ఈరోజు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి శుభ్రత చేసి పూలదండ వేయడం జరిగింది.
ఈ సందర్భంగా నూతంగా గిరిజన మోర్ఛ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేనావత్ రవి నాయక్ గారిని శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించడం జరిగింది. జిల్లాలో గిరిజనులను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో గిరిజన మోర్చా ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, మొగిలి దుర్గాప్రసాద్, నారాయణ చారి, నాయకులు పొలదస్ రాము, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్,మండలాల అధ్యక్షులు రాము, భూషయ్య, బోడ నరసింహ, జిల్లా కార్యాలయ కార్యదర్శి చందు, తదితరులు పాల్గొన్నారు.