రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 11:- సగరులు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరుల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఆదివారం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ సమీపంలో జరిగిన జిల్లా సగర సంఘం ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన సగరులను ఉద్దేశించి శేఖర్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ,మండల పరిషత్ ఎన్నికలలో సగరుల చైతన్యాన్ని ప్రదర్శించి రాజకీయంగా ఎదగాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులకు సముచిత స్థానం కల్పించే రాజకీయ పార్టీలను ఆదరిస్తామని, సగరులను రాజకీయంగా విస్మరించే రాజకీయ పార్టీలను ఓడించడానికి ఏకమవుతామని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సగరులను మరింత చైతన్యవంతులను చేసే క్రమంలో అన్ని జిల్లాలలో పాలకవర్గాలను నూతనంగా ఏర్పాటు చేసి సంఘాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తాత్రేయ సగర, కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, రాష్ట్ర సగర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, రాష్ట్ర నాయకులు రవీందర్ సగర, శ్రీకాంత్ సగర, పోచయ్య సగర, జిల్లా కోశాధికారి సంధిల సాయిలు సగర, మాజీ జిల్లా అధ్యక్షులు ఓంకార్ సగర, జిల్లాలోని దాదాపు 60 గ్రామాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
*మెదక్ జిల్లా సగర సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక*
రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర సమక్షంలో మెదక్ జిల్లా సగర సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎనికైంది.జిల్లా అధ్యక్షులుగా సందిల సాయిలు సగర, ప్రధాన కార్యదర్శిగా మర్కు నగేష్ సగర, కోశాధికారిగా ధ్యాప బాలకృష్ణ సగర నియామకం జిల్లా యువజన సంఘం
అధ్యక్షులుగా ఉప్పరి శ్రీనివాస్ సగర, ప్రధానకార్యదర్శిగా వగ్గు శ్రీకాంత్ సగర, కోశాధికారిగా ఉప్పరి సాయిలు నియమితులయ్యారు.