నేటి గదర్, ఆగస్టు 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ,
అలవాల వంశీ 9052354516 :
దుమ్ముగూడెం మండల పరిధిలోని కొత్తపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక విద్యార్థి మృతికి కారకులైన డిప్యూటీ వార్డెన్ హరికృష్ణ ను సస్పెండ్ చేస్తూ, అదే పాఠశాల హెచ్ఎం నరసింహారావుకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ షోకజ్ నోటీసును అందించడం జరిగిందని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న దుమ్ముగూడెం మండలం బండారు గూడెం గ్రామానికి చెందిన కుంజ దీపక్ రెండు రోజులు సెలవులు ఉన్నందున స్నేహితులతో కలిసి తన స్వగ్రామానికి ఆటోలో బయలుదేరుతుండగా ఏటపాక మండలం తునికి చెరువు దగ్గర గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఈ విద్యార్థి అక్కడికక్కడే మరణించడం జరిగిందని ఆయన అన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను హెచ్ఎం నరసింహారావుకు షోకాజ్ నోటీసు, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను, డిప్యూటీ వార్డెన్ హరికృష్ణ ను సస్పెండ్ చేయాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మను ఆదేశించడం జరిగిందని, శనివారం నాడు వారికి షోకాజ్ నోటీస్, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్, సస్పెండ్ ఆర్డర్స్ ను అందించడం జరిగిందని అన్నారు