నేటి గదర్ న్యూస్ ఆగష్టు11:వైరా నియోజకవర్గప్రతినిధి, శ్రీనివాసరావు.
కారేపల్లి: ఆగస్టు15న వైరా లో జరిగే సీఎం రేవంత్ సభకు ప్రజలు తండోపతండాలుగా కదలి రావాలని వైరా ఎమ్మెల్యే. మాలోత్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య దేశంలో రైతులకు 2లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు15 న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తున్నరన్నారు. ఇప్పటికే లక్ష, లక్ష యాబై వేళా వరకు రుణ ఉన్న రైతులకు రుణమాఫీ అయ్యాయని తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన మీకు నా జీవితమంత రుణపడి ఉంటానన్నారు. 18 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్ ద్వారా జూలూరుపాడు, ఏన్కూరు, మండల ద్వారా వైరా రిజర్వాయర్ కు తరలించి, అక్కడి నుండి కొనిజర్ల మండలానికి వ్యవసాయనికి నీళ్లు అందిస్తమన్నారు. రాబోయే రోజుల్లో మన జిల్లా మంత్రులు సహాయంతో కారేపల్లి మండలానికి వ్యవసాయనికి నీరు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. నియోజకవర్గంలో 5వేల బోర్లను పోడు భూముల్లో వేయించడం జరిగిందన్నారు. పాత, కొత్త అందరూ సమన్వయంతో కలసి పని చేసి సభ విజయవంతం చేయాలన్నారు. మండలంలోని 41 గ్రామ పంచాయితీల నుండి ప్రజలు, రైతులు, కార్యకర్తలు భారీగా సీఎం సభను తరలిరావాలని పిలుపునిచ్చారు.