+91 95819 05907

బడుగుల బాటసారి సర్దార్ సర్వాయి పాపన్న

బడుగుల బాటసారి
సర్దార్ సర్వాయి పాపన్న

అంబాల నారాయణ గౌడ్
గౌడ్ ఐక్య సాధన సమితి
రాష్ట్ర అద్యక్షులు

ఊరు కొడితేనేమి పలం, వాడ కొడితేనేమి పలం, కొడితే బందర్ బస్తీలు కొట్టాలి, నెల్లూరు కొట్టాలి,
మైసూరు కొట్టాలి, కొడితే గోల్కొండ కొట్టాలి, రాజులం కావాలి రాజ్యామేలాలని బహుజన కులాలను ఏకం చేసి, రాజ్యాధికార కాంక్షను రగిలించిన పోరాట యోదులు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్..
తెలంగాణలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసి,దక్కన్ రాజ్యంపై డిల్లీ పెత్తనాన్ని ధిక్కరించి గోల్కొండ ఖిల్లాపై స్వతంత్ర బావుటా ఎగరవేసిన బహజన విప్లవవీరుడు సర్వాయి పాపన్న గౌడ్.
జనన మరణాలు తెలియని వారు చాలా మంది ఉంటారు. కాని సార్దక నామం కలిగిన వారు అరుదుగా ఉంటారు.
అలాంటి కోవకు చెందిన వారే సర్వాయి పాపన్న.
పుట్టక సాధరమైన ఆయన జీవించిన కాలం అసాధరణమైనది.
వ్యక్తి గా కాకుండా బహుజన శక్తిగా ఎదిగిన ధీశాలి సర్వాయి పాపన్న. . 16చివరి నుండి 17 వ శతాబ్దంలో ప్రజాస్వామ్య సౌరబాలను వెదజల్లారు సర్వాయి పాపన్న .

గతం గతః అనుకుటే పొరపాటు.
చరిత్ర లోతుల్లోకి వెలితే 300 సంవత్సరాలకు పూర్వమే సమ సమాజం కోసం కార్యాచరణ ప్రారంభించి సఫలీకృతులయ్యాడు పాపన్న;

సామాన్య కల్లు గీత కుటుంబంలో జన్మించాడు.మొదట్లో కుల వ్రృత్తి గీత వృత్తినే స్వీకరించారు.
కాని 17 వ శతాబ్దంలో మొఘల్ పాలనలో డిల్లీ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో పెత్తందార్ల పునాదులు ప్రజలను పీడిస్తున్నాయి.

ఈ పరాయి పాలనలో బానిసలుగా బతకడం కంటే స్వయం పాలన చేసుకుందాం అని పాపన్న ఆలోచనలు చేశాడు.
స్వతహగా నాయకత్వ లక్షణాలు ఉన్న పాపన్న అనేక కులాలను సమన్వయం చేయడమే లక్ష్యంగా అనుకున్నాడు. ఈ సమయంలో తోటి బహుజన కులలైన గొల్ల బయ్యాన్న , మున్నూరు సిద్దయ్య, కుమ్మరి గోవింద్, సాకలి సర్వన్న , మంగళి మాసన్న , దూదేకుల పీర్, కొత్వాల్ మీర్ సాహేబ్, జక్కుల పెరమాలు, లంబాడి లాల్ ఇలా అనేక మంది బహుజన కులలైన వారిని చేరదీసాడు

మొగలు రాజరికపు పునాదుల్లో సామ్యవాదాన్ని స్థాపించటమే లక్ష్యంగా ప్రతినను ప్రకటించాడు.

కులం,మతం,వర్గ బేధం లేని అనేక మందితో సైన్యాన్ని తయారుచేసి మొగలు రాజరికపు పునాదులు కదిలించాడు పాపన్న . మొఘల్ ఎదురించి అణగారిన వర్గాల ప్రజలను రాజులను చేసి స్థానికంగా కోటలను నిర్మాణం చేసి ఒక్క సామాజిక వర్గం వారిని ఒక్కో ప్రాంతానికి రాజులను చేసాడు, తాటికొండ, ఖిలాషాపురం వేముల కొండ,,భువనగిరి,సర్వాయిపేట ,
వరంగల్ లాంటి ప్రాంతాల్లో 33 కోటలు నిర్మాణం చేసుకున్నారు.

12 వేల మందితో మొగలు సామ్రాజ్య వాదుల పాలనపై స్వయం పాలన జెండా ఎగురవేసాడు. తాటి కొండ ఖిలేషాపురం భువనగిరి కోటల కేంద్రం గా పాలన సాగించాడు పాపన్న.

గోల్కొండ కోటపై ఆత్మగౌరవ యాత్ర కొనసాగించి విజయం సాధించాడు సర్వాయి పాపన్న.

ప్రపంచంలో ఏ సాంకేతిక అందుబాటులో లెనప్పుడు పటిష్టమైన కోటల నిర్మాణం పాపన్న కాలంలో నిర్మించబడ్డాయి.
ముంగిట్లో ముత్యాలు రాశులు గా పోసి అమ్మిన గోల్కొండ ను ఆరు నెలలు ఏలినాడు పాపన్న .

ఈ కాలంలో పాపన్న జన హ్రదయ సంస్కరణలు చేశాడు.పాపన్న పాలనలో పన్నులు లేవు.
కులవ్రృత్తులనుప్రోత్సహించాడు.
వేలాది ఎకరాల్లో తాటి ,ఈత వనాలను పెంచుటకై క్రృషి చేశాడు.
వ్యవసాయ అభివృద్ధి కోసం గుట్ట లపై గొలుసు కట్టు చెరువులు త్రవ్వించి,చెక్ డ్యాంల నిర్మాణం చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు.
దాదాపు 12 వేల అరుకల భూమిని పేదలకు పంపిణీ చేసాడు.
ఇప్పటికి సర్వాయిపేట గుట్టల్లో ఉన్న సెలయేర్లు, వాగులు,వంకలు,అపారమైన వనవ్రృక్షం ఎన్నో వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, పక్షుల కిలకిలరాగాలు,జీవ వైవిధ్యం దర్శనమిస్తుంది.
ఇదిపాపన్నపాలనాధక్షణకునిదర్శనం .
పూలే ,అంబేద్కర్ మార్క్స్ కంటే ముందే సామాజిక న్యాయాన్ని సమసమాజ హితం కోసం కృషి చేశాడు పాపన్న .

తన రాజ్యంలో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే గ్రామదేవతలకు చోటునిచ్చి బహుజన పండుగలను ప్రోత్సహించాడు.నేటికి పాపన్న నిర్మించిన హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం, గోల్కొండ కోట పైన ఎల్లమ్మ గుడులు సజీవసాక్షం.
స్వతంత్ర భావాలను చూసి మొగల్ బహదూర్ షా; పాపన్నకు స్నేహ హస్తం అందించారు.

దక్కన్ మొగల్ కేంద్రానికి తగిన కప్పం చెల్లిస్తే
గోల్కొండ రాజ్యానికి రాజును చేస్తానని చెప్పడంతో పాపన్న పద్నాలుగు లక్షలు ఇతర విలువైన కానుకలు చెల్లించడంతో పాపన్న ను గోల్కొండ సింహాసనంకు రాజును చేసి
రాజా దుస్తులు ఖడ్గం ఇచ్చి రాజాభరణాలతో గోల్కొండ పరిగనకు రాజును చేసాడు; బహుదురుషా.

ఈ విషయం తెలుసుకున్నా స్థానిక పాలకులు పాపన్న పై కక్ష పూరితంగా వ్యవహరించి డిల్లి లోని ఇంపిరియల్ లా కోర్టు కు వెళ్లి అక్కడ వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటారు;

కల్లు గీత సామాజిక వర్గం వాల్లు రాజరికానికి అర్హులు కారాని తీర్పు వెలువడంతో అంతమొందించడానానికి పాపన్న పై అనేక కుట్రలు పన్నడం మొదలవుతుంది .

ఈ పోరాటం లో అనేక దపలుగా పాపన్న మొగల్ సైన్యాన్ని వీరోచితంగా ఎదుర్కొని ఓడించడం జరుగుతుంది.

సామ్యవాద గొంతుక అయిన పాపన్న చరిత్రను
పాలకులు నిర్లక్ష్యం చేస్తే జానపద కళాకారులు ప్రపంచ వ్యాప్తంగా పాపన్న చరిత్ర కు నేటి వరకు గుర్తింపు తీసుకు వచ్చారు. ఔరంగజేబు కాలంలో ఖాఫీఖాన్ అనే రచయిత ఉండేవారు. అనివార్య కారణాల వలన హస్తిన ను వదిలి గోల్కొండ కు వచ్చి రహస్య జీవనం కొనసాగించారు.

ఔరంగజేబు గురించిన వివరాలను ముంతకాబ్ ఉల్ లులాబ్ పేరుతో పుస్తకాన్ని రచించారు.

ఆ పుస్తకం ఆధారంగా యూరోపియన్ చరిత్ర కారుడు రిచర్డ్ యమ్ ఈటన్ A social History of the Deccan 1300-1706 పేరుతొ పుస్తకాన్ని రాశారు. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రచురించటం విశేషం.

సర్ధార్ పాపన్న చిత్ర పటాన్ని ఆ పుస్తక ముఖ చిత్రం గా ప్రచురించడం విశేషం.
ఇంగ్లండ్ లోని ఆల్బర్ట్ మ్యూజియం లో పాపన్న చిత్రం ఉండటం పాపన్న ధీరత్వానికి సూచిక.

స్వదేశంలో. వలస పాలనా కాలంలో నిర్లక్ష్యం చేయబడిన పాపన్న చరిత్ర ను స్వరాష్ట్రంలో తెలంగాణలో ఆయన కోటలను పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు , యువనేత
కెటిఆర్ మరియు, బలహీన వర్గాల ప్రతినిధి, రాష్ట్ర మంత్రి వర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలకర్ గారు, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు పాపన్న జయంతి, వర్ధంతి అధికారికంగా ప్రకటించడం హర్షనీయం

నేటి తరం జనం పాపన్నను గుర్తు చేసుకోవడం అంటే తెలంగాణ ఆత్మను బడుగుల గౌరవాన్ని, పోరాట పఠిమను యాది చేసుకోవడమే .
Source : Narayayanagoud Ambala

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !