నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), ఆగస్టు 12:
ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చే బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ లోకల్ బడి పి. శ్రీజ, అదనపు రెవెన్యూ కలెక్టర్ మహేందర్ జి ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ల తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు పరిష్కరించాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పెండింగ్లో పెట్టవద్దని, వారం వారం ఫిర్యాదులు పరిష్కరిం చుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో రెవిన్యూ శాఖకు సంబంధించినవి 35, పింఛన్లకు సంబంధించినవి 08, 2 బి హెచ్ కే సంబంధించినవి 02, ఉద్యోగాలకు సంబంధించి 05, దళిత బందుకు సంబంధించి 10, ఇతర శాఖలకు సంబంధించినవి 22 మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిఆర్డిఓ సంపత్ రావ్ , డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డిసీ ఎస్ ఓ రాంపతి, డిసిఓ సర్దార్ సింగ్, సి పి ఓ ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, ఇతర అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎంపి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.