*.*
*జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.*
సిల్వర్ రాజేష్ నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా
ఆగస్ట్ -12-2024.
మెదక్ జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఈ రోజు మెదక్ జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేటు కార్యాలయం వద్ద ఉన్నటువంటి బీడీ కార్మికులకు మరియు బాలురకు షీ టీమ్ అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి మెదక్ షీ టీమ్ ఇంచార్జ్ ఏ.ఎస్సై రుక్సానా, మెదక్ జిల్లా షీ టీం కానిస్టేబుళ్లు విజయ్ మరియు ప్రమిలా అవగాహనా సదస్సుల ద్వారా బాలికలు మరియు మహిళల పై జరుగుతున్న లైంగిక వేధింపులు లైంగిక దాడులు యాంటీర్యాగింగ్,ఆత్మహత్యలు సైబర్ క్రైమ్స్ T-Safe అప్లికేషన్ మరియు బాలికల అక్రమ రవాణా పైన అవగాహనా కల్పిస్తున్నామని అన్నారు . మహిళలకు కొత్తగా పొందుపర్చిన చట్టాల పై అవగాహన కల్పించారు. అదే విధంగా తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా మహిళ భద్రత కోసం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా లోని షీ టీమ్స్ విభాగాలు మహిళలు మరియు విద్యార్థులకు రక్షణ కవచంగా నిలుస్తూన్నాయని ఆపద సమయంలో విద్యార్థులకు రక్షణ కల్పించాలనే ప్రధమ ధేయం తో షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఒకవేళ ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు గాని తెలిసిన వ్యక్తులు ఆకతాయి చేష్టలు చేస్తే పోలీస్ వారి దృష్టికి తీకురావాలని తెలిపారు. ఆపద సమయం లో డయల్ 100,షీ టీమ్ మెదక్ జిల్లా వారి నెంబరుకు 8712657963 సంప్రదించాలని లేదా వ్వాట్సాప్ మెసేజ్ చేయాలి అని అన్నారు. మీ యొక్క వివరాలను గొప్యంగా ఉంచి మీరు సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మహిళలు ఒంటరిగా ఆటోలలో బస్సులో ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుమానంగా అనిపిస్తే షీ టీమ్ వారి కి లేదా డైయల్ 100 ను సంప్రదించాలని తెలపడం జరిగింది. మహిళలు పలు జాగ్రతలు పాటించి ధ్యైర్యంగా ముందుకు సాగి ఎట్టి పరిస్థితి లోను ఎవరికీ కూడా భయపడకుండా ఎవరికి లొంగకుడదని తెలిపారు. ఒకవేళ సైబర్ హరాస్మెంట్ కు గురైన సమయంలో సైబర్ క్రైమ్ కు లేదా తక్షణమే డయల్ 1930 లేదా డయల్ 100 కి లేదా సంబంధిత పోలీసు స్టేషన్ నందు సంప్రదించాలని తెలిపారు.
షీ టీమ్స్ ను సంప్రదించడానికి వాట్సప్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు క్యూఆర్ కోడ్ లను ఉపయోగించుకుని సేవలను పొందుకోవాలని తెలియచేయడం జరిగింది.
ఈ అవగాహన సదస్సులలో మెదక్ జిల్లా షీ టీం సభ్యులు ఏ.ఎస్సై రుక్సానా కానిస్టేబుళ్లు విజయ్ ప్రమిల మరియు పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.