నేటి గద్దర్ కరకగూడెం: 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని వాడవాడలా మూడు రంగుల త్రివర్ణ పతాకం రేపరెపలాడాయి.తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు నాగప్రసాద్,మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడిఓ దేవ వరకుమార్,పోలిస్ స్టేషను,ఎపిజీవీబీ బ్యాంక్,ఐకేపి కార్యాలయాల నందు సంబంధించిన అధికారులు జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ మన భారతదేశం ప్రజానీకానికి స్వెచ్చ స్వతంత్రం వచ్చి నేటికీ 77 వ సంవత్సరం విడిసి 78 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా యావత్తు దేశానికి,దేశ జనజీవనాన్ని సాగిస్తున్న ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంచార్జీ ఎంపిడిఓ దేవా వరకుమార్ మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగధ్వనుల వల్ల మానం ఈరోజు స్వేచ్చ జీవితాన్ని గడప గలుగుతున్నాం,నవాబులు,బ్రిటిష్ పరిపాలనలకు కాలం చెల్లింది అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎంచుకొని జనజీవన సాగరాన్ని గడుపుతు స్వేచ్ఛ విలువలను కాపాడుకుంటూ పయనించ గలుగుతున్నాం అని తెలిపారు.