చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలను అసభ్యంగా వేదిందించిన లెక్చరర్ పై సెలవు దినం రోజున విచారణ చేపట్టిన నోడల్ అధికారి ఆ విచారణ తప్పుడు రిపోర్ట్ గా పరిగణనలోకి తీసుకొని ఉన్నతమహిళా అధికారులు విద్యార్థినిలను విచారణ చేపట్టాలి అని డిమాండ్.ఈ రోజు మంగళవారం భద్రాచలం ఐటీడీఏలో మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అధ్యక్షత జరిగిన సమావేశంలో రాష్ట్ర గోండ్వాన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ సెలవు దినం రోజు ఆగమేఘాల మీద వెళ్లి నోడల్ అధికారి తూతూ మత్రాంగా ప్రేమరి విచారణ చేపట్టి వారికి అనుకూలంగా ఉన్న విద్యార్థుల ను పిలిపించు కొని తదుపరి రిపోర్ట్ RJD కి పంపనున్నారుఅని .కళాశాల వర్కింగ్ సమయంలో ఆదివాసీ విద్యార్థినిలు అందరూ వుండే సమయంలో చేయవలసిన విచారణ ను చేయకుండా లెక్చరర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు మా యొక్క విచారణలో తేటతెల్లమైందని అన్నారు కొంత మంది పిల్లలను పిలిపించుకొని వారినుండి సంతకాలు సేకరించుకొని సెలవు రోజున హుటాహుటిన మహిళా అధికారులు లేకుండా మహిళా విద్యార్థులను స్థానిక కళాశాల లో వుండే మహిళా లెక్చరర్ల చేతనే విచారణ జరిపి రిపోర్ట్ తీసుకొని ఉన్నత జిల్లా పంపించే అధికారి RJD అధికారి వారికి పంపించేరిపోర్ట్ ను తప్పుడు రిపోర్ట్ గా నే భావించాలి అని ఈ సందర్భంగా తెలిపారు.