.
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), ఆగస్టు 27:
జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన సేవాలాల్ సేన రాష్ట్ర సంకల్ప సభలో ములుగు జిల్లా కు చెందిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరిక రాహుల్ నాయక్ మరియు సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య జంపన్న లను ఘనంగా సన్మానించిన జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ నాయకులు.వీరు మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పట్ల జాతి ఐక్యతను,జాతి సమస్యలను పరిష్కారంలో ముందు వరుసలో ఉండి జాతిలో ఉన్న ఏ సభ్యుడికి గాని,అన్యాయం గాని ఆపద గాని వస్తే మేము ముందుండి వారి సమస్యలను మా భుజస్కందాల మీద వేసుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, ప్రధాన కార్యదర్శి రేఖా నాయక్ , జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయక్ , వ్యవస్థాపన అధ్యక్షులు ధరావత్ ప్రేమ్ చంద్, ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.