నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), ఆగస్టు 28:
ములుగు జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తో కలిసి
జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కి ఆస్పత్రిలో పేషంట్ లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులు వివరించారు. స్వయంగా రాష్ట్ర గవర్నర్, మంత్రి సీతక్క రోగులను అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేషంట్ లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ బి వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ శబరీష్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.