+91 95819 05907

అక్రమ ఇసుక రవాణా వెంటనే ఆపాలి:: మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), ఆగస్టు 28:

ములుగు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో 30కి పైగా ఇసుక క్వారీలో ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల రైతులకు మేలు చేయాలి అంటూ పట్టా భూములకు ఇసుక అనుమతులు ములుగు జిల్లాకు అధికంగా ఇవ్వడం జరిగింది
ములుగు జిల్లా పరిధిలో ఉన్న వాజేడు వెంకటాపూర్ ఎటునాగారం మంగపేట మండలాల పరిధిలో ఏక్కడ చూసిన ఇసుకక్వారీలు అనేకంగా ఉన్నాయి ఈ ఇసుక క్వారీల తవ్వకాలు గోదావరిలో అనుమతులకు మించి తవ్వడం వలన భూగర్భ జలాల అడుగంటిపోయి రైతుల బోర్లు ఫెయిల్ అవుతున్నాయి భూగర్భ జలాలు సక్రమంగా అందకపోవడం వలన అన్నదాతలు కష్టాలకు గురికావాల్సి వస్తుంది
ప్రతిరోజు ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై ఇసుక లారీలు అనేకంగా తిరుగుతూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవేవీ అధికార పార్టీ నాయకులకు కనపడటం లేదా అని మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ గారు అధికార పార్టీని సూటిగా ప్రశ్నించారు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడం వలన ఇసుక మాఫియా చెలరేగిపోతుందని పేర్కొన్నారు
ఇసుక లారీలు అధిక లోడ్ తో అనుమతులకు మించి ఇసుక పోసుకొని వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇలాంటి అరికట్టవలసిన టిఎస్ఎండిసి మైనింగ్ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరు ఎత్తకుండా ఉంటున్నారు అనుమతులు పొందింది గోరంతా అయితే గోదారమ్మ గర్భాన్ని చీల్చి ఇసుక తవ్వేది కొండంత అవుతుంది ఎవరైనా మీడియా మిత్రులు ఫోటోలు తీసి వార్త రాసే ప్రయత్నం చేస్తే క్వారీ యజమానులు అధికార పార్టీ మాది స్థానిక పాలకుల అండ దండల పుష్కలంగా ఉన్నాయి మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని బెదిరిస్తున్నారు లారీలు అధిక లోడ్ తో వెళ్తూ ప్రధాన రహదారులను సర్వనాశనం చేస్తున్నాయని ఎన్నిసార్లు ప్రజలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు . ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి క్వారీ పాలయిగూడెం దగ్గర రోడ్డుపై లారీలనుంచి లోడింగ్ చేస్తున్నారు అది కూడా అనుమతుల గురించి ఒక బకెట్ ఎక్కువ పోస్తే ఎక్కువ రేటుకు దీని ద్వారా ట్రాఫిక్ జామ్ అయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రజల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఒకానొక సమయంలో లారీలు మొరాయించినప్పుడు ప్రధాన రహదారిపై ఫోక్లైన్ సహాయంతో రోడ్డుపై లారీలను ముందుకు దొబ్బడం జరుగుతుందని ఈ తతంగం అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో జరుగుతుందని దుయ్యబట్టారు ములుగు జిల్లాకు ఇసుక కోసం వచ్చే ప్రతిసారి ప్రభుత్వానికి డిడి చెల్లించాల్సి ఉంటుంది ఒక్కో డిడి బుకింగ్ పై మూడు నాలుగు సార్లు ఇసుక రవాణా చేయడం జరుగుతుందని ఒక డిడి పై రెండు నుంచి మూడు లారీల ఇసుక తరలి వెళ్తుందని దాంతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి పడుతుందని పేర్కొన్నారు
ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ గారు స్పందించి గోదావరి నది తీర ప్రాంతాన్ని ఏం జరుగుతుందో తెలుసుకొని అక్రమాలకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఇసుక క్వారీ లను మూసివేయాలని ములుగు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే అధికారులే లేరా మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి ఇసుక క్వారీలపై నిగా పెట్టాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ గారు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !