రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్,ప్రగతి ధర్మారం గ్రామాలను బుధవారం రోజు జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఈడి విజయలక్ష్మి, ఉమ్మడి మెదక్ జిల్లా న్యాక్ డైరెక్టర్ రాము సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనాపూర్, ప్రగతి ధర్మారం గ్రామాల్లో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ల కోసం స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.అదేవిధంగా ఈ గ్రామాలలో మూడు నెలల పాటు ఎస్సీ కార్పొరేషన్ క్రింద మహిళలకు 30 మందితో ఒక కుట్టు శిక్షణ సెంటర్ ఏర్పాటు చేసి ఈ రెండు సెంటర్లలో త్వరలో ఎస్సీ మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఆసక్తిగల మహిళలు న్యాక్ శిక్షణ సెంటర్ ను సంప్రదించి శిక్షణ పొందవచ్చని, వారికి కుట్టు శిక్షణ అనంతరం వారికి ప్రభుత్వపరంగా గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ మరియు ఉచిత కుట్టు మిషన్ ను అందజేస్తామని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట న్యాక్ సెంటర్ ఇన్చార్జి నిజాముద్దీన్,మండల మాజీ ఎంపీపీ బిక్షపతి, కోనాపూర్ విద్యాసాగర్, మాసాయిపేట మల్లేశం తదితరులు పాల్గొన్నారు.