బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డెంపూడి నరేష్..
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
సెప్టెంబర్ 5 నుండి మొదలు కానున్న బీజేపీ సభ్యత్వ నమోదులో కూసుమంచి మండలం ముందుండాలని మండల ప్రధాన కార్యదర్శి వడ్డెంపూడి నరేష్ ఓ ప్రకటనలో పిలుపిచ్చారు… జాతీయ భావజాలం బీజేపీలోనే ఎక్కువగా ఉందని,సేవా గుణమున్న కార్యకర్తలకు కమలం పార్టీలో లోటు లేదని ఆయన పేర్కొన్నారు. సభ్యత్వంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో బీజేపీ ఉందని.. సభ్యత్వ నమోదును ఈసారి రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని సభ్యత్వం మరింత జోరుగా చేయాలనీ పిలిపించారు.
Post Views: 29