.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి,✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు.
సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని ఫోన్లో సూచన.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలందరని అప్రమత్తం చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయని అందువలన అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి వచ్చేలా సూచనలు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సంభందిత అధికారులతో మాట్లాడాలన్నారు. సహాయక చర్యలు అవసరమైతే చేపట్టే విధంగా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని రెండు జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.