నేటి గదర్ న్యూస్ , సెప్టెంబర్ 11 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
కూసుమంచి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలిచారు కూసుమంచి బీజేపీ నాయకులు.. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో వరదల వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్ కుమార్ లు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను కూసుమంచి బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో బాధితులకు కిట్లను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బజ్జూరి మల్లారెడ్డి , మండల నాయకులు హాట్యా నాయక్ ,దాసరి వెంకటేశ్వర్లు ,గుండా ఉపేందర్ రెడ్డి ,గడ్డం వెంకటేశ్వర్లు ,వడ్డెంపూడి నరేష్ ,సోమనపల్లి వెంకన్న ,మహేంద్ర నాయక్ ,కోడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు..
Post Views: 197