రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 17:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో పాటు హోమ కార్యక్రమాలు నిర్వహించారు.ఇట్టి హోమ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి దంపతులు పట్టణ అధ్యక్షులు కృష్ణాపురం రామకృష్ణ చారి దంపతులు ఉపాధ్యక్షులు పూన రవీందర్ చారి దంపతులు రాయవరపు శంకర్ దంపతులు పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంకోజు దామోదర్ చారి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవానుని పూజ సందర్భంగా విశ్వకర్మ జాతియులైనటువంటి కేవలం కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిని ప్రభుత్వం వెంటనే విశ్వకర్మ ఫెడరేషన్ ఏర్పాటు చేసి తద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారు చేసే రంగంలో పనిముట్లను ఫెడరేషన్ ద్వారా ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.అలాగే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని సెలవు దినంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎక్కడికక్కడ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సరాపు ప్రశాంత్ చారి,కోశాధికారి మైలవరం వేణుమాధవ్ చారి, జాయింట్ సెక్రెటరీ రాయవరపు కిరణ్ చారి, గౌరవ అధ్యక్షులు ఎల్ది లక్ష్మీనారాయణ చారి, ఉప కోశాధికారి మద్దూరి నవీన్ చారి, వనపర్తి రమేష్ చారి, సరాపు వేణు చారి,గుడి కందుల రవి చారి,నక్క నరేందర్ చారి,రాయారపునాగరాజు చారి,చల్మెడ బ్రహ్మం చారి,చల్మెడ శ్రీనివాస్ చారి, స్వర్ణకార సంఘం సభ్యులు మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.