★క్రమ శిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యం అడిషనల్ కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించిన అడిషనల్ కలెక్టర్ డి మధు సూధన్ నాయక్.. ఈ సందర్భంగా సుమారు గంటన్నర సేపు పదవ తరగతి విద్యార్థినులతో విద్య పై ప్రేరణ కలిగించే అంశాలను ముఖా ముఖి మాట్లాడుతూ బాగా చదువుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలని పదవ తరగతి అనేది విద్యార్థి దశలో ఒక మలుపు అని అన్నారు.. హాస్టల్లో చదివే విద్యార్థినులు బాగా చదువుకోవాలని ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, గ్రామీణ ప్రాంతం నుండి, పేదరికం నుండి వచ్చిన వారే ఎక్కువ ఉంటారని, విద్యార్థులు సైతం అదే రీతిన కష్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థానం పొందాలని అన్నారు. కష్టపడి చదివితే జీవితంలో స్థిరపడవచ్చు అని చెప్తూ.. ఈ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తిని విద్యార్థులకు బోధిస్తూ “లక్ష్యానికి అడ్డం వచ్చేది, లక్ష్యాన్ని దూరం జరిపేది ఏదైనా విషం తో సమానమని“ అన్నారు.. అలాగే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు చూసాను కానీ న్యూ లక్ష్మీపురం కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు చాలా చురుకుగా అభినయంగా క్రమ శిక్షణతో ఉన్నారని.. అధ్యాపక బృందం చాలా అద్భుతంగా క్రమ శిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను, నాణ్యమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారని అభినందించారు.. అనంతరం స్పెషల్ ఆఫీసర్ బండారు ఇందిరా మరియు విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చుని విద్యార్థినులతో ముఖాముఖి కలిసి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసారు.