◆దొబ్బల,శిరీష మాజీ పిడిఎస్ యూ జిల్లా నాయకులు
నేటి గదర్ న్యూస్,ఖమ్మం:
విద్యార్థుల పోరు పతాక, సమాజ చైతన్య దీపిక, సమరశీల పోరాటవేదిక, అవినీతిపై, ఆశ్రిత పక్షపాతంపై ఆగ్రహించిన జ్వాల- సమస్యలతో రణం చేసి తెలుగునాట త్యాగమయపు, విప్లవబాటను విద్యార్థులకు చూపిన దిక్సూచే పీడీఎస్ యూ నాలుగక్షరాల పేరు కానీ, కోట్లాది మంది విద్యార్థులకు చలనాన్ని, కదనాన్ని అందించిన సంస్థనే పిడిఎస్ యూ అని స్థానిక సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పిడిఎసు యూ 50వసంతాల స్వర్ణోత్సవ సభలో ముఖ్యవక్తగా పాల్గొని మాజీ పిడిఎస్ యూ పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొబ్బల శిరీష ,పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్బంగా దొబ్బల శిరీష, పిడిఎస్ యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ లు పాల్గొని మాట్లాడుతూ..
శాస్త్రీయ విచ్వే సాధనగా, విద్యార్థి హక్కులకై, విద్యారంగ సమస్యలపై 30 ఎళ్ళగా సమరశిల పోరాటాలు నిర్వహించింది. ధనికులకైనా, పేదలకైనా ఒకే విద్యా విధానం ఉండేందుకు కామన్ స్కూల్ విధానం అమలుకై ఉద్యమిస్తున్నది. విద్యార్థుల స్కాలర్షిన్స్, మెస్ ఛార్జీలు ధరల కనుగుణంగా పెంచాలని ఉద్యమించిందాన్నారు.విదేశీ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ స్వదేశీ యూనివర్సిటీల ఐలోపేతంబై గళమెత్తింది. ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పోరాడుతుంది. (ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడిని నియంత్రించేందుకు “ఫీజుల నియంత్రణ చట్టం” చేయాలని పోరాటం చేస్తున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యారంగానికి 30% నిధులు కేటాయింపుకై నిత్యం పోరాటం చేస్తున్నది. విద్యా సంస్థలలో ఖాళీలు భర్తీ చేసి, నాణ్యమైన విద్యను అందించాలని, పోరాడుతున్నదిని
ఇలాంటి పరిస్థితిలో 50 ఏండ్ల మహాప్రస్థానాన్ని సంస్థలో సమీక్షించుకోవాలని సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం గా జరిగే సభకు విద్యార్థులు, ప్రగతిశీల వదులు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పిడిఎస్ యూ జిల్లా నాయకులు వినయ్, శ్రీను, హితేష్, వంశీ, యశ్వంత్, వెంకటేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు..