నేటి గదర్ డుంబ్రిగూడ ( 20, సెప్టెంబర్) న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం అరకు నేరేడు వలస పాత పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న ప్రభుత్వ స్ధలం కబ్జాకు గురయింది వెంటనే నిర్మాణాలు నిలుపుదల చేయాలి.ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తామర్ల.సూర్యనారాయణ, మండల అద్యక్షుడు పాంగి. డొంబు డిమాండ్ చేశారు. నేషనల్ హైవే516E రోడ్డు ప్రక్కన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురౌతున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది గిరిజనేతరులు భినామీ పేర్లతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోని1/70చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు.పంచాయతీ అధికారులు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇచ్చి ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు.అసలు అరకు పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ, విఆర్వో ఉన్నారా?లేదా పై స్ధాయి అధికారులు చెప్పాలనీ డిమాండ్ చేశారు. ఎంతోమంది స్ధానిక గిరిజనులకు ఇళ్ళు స్ధలాలు లేక గ్రృహలు నిర్మాణం చేసుకోలేకపోతున్నారనీ చెప్పారు.అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్న పంచాయతీ సెక్రటరీ ను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.