నేటి గద్దర్ న్యూస్ గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండల లలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలను కొత్తగూడెం డి ఎం ఎం హెచ్ ఓ భాస్కర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రోగులతో కొద్దిసేపు మాట్లాడి వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి, మురళీకృష్ణ, ఆళ్లపల్లి ప్రాథమిక వైద్యశాల వైద్యులు సంఘమిత్ర, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 13