తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సోయి లేకుండా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారని చండ్రుగొండ మండల బీజేపీ నాయకులు గడ్డం శ్రీను అన్నారు. ఓ మంత్రి అక్టోబర్ రెండు నుండి రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటిస్తుంటే, మరో మంత్రి అదే నెల 15వ తేదీ నుండి ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవాలని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెళ్లయి పిల్లలతో ఉన్న కొత్త జంట రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటారని చెప్పారు. రేషన్ కార్డు వచ్చాకే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండానే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందా అని ఈ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, ప్రజలకు సరైన స్టేట్మెంట్లు ఇవ్వాలని కోరారు. మంత్రుల స్టేట్మెంట్లతో ప్రజలు గందరగోళంలో పడుతున్నారని అన్నారు.