నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 24: వైరా ప్రతినిధి శ్రీనివాస రావు.
కొణిజర్ల మండల పరిధిలో తుమ్మలపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ మహాసభ కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ లో శాఖ కార్యదర్శి బొడ్డుపల్లి వీరభద్రం అధ్యక్షతన జరిగింది. మహాసభకు ముందు పార్టీ జెండాను సీనియర్ నాయకులు తుమ్మలపల్లి మాజీ సర్పంచ్ కొత్తపల్లి నారాయణ ఆవిష్కరించారు.మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్య వీరభద్రం మరియు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ హాజరైనారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పుచ్చలపల్లి సుందరయ్య గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు ఈ మహాసభలో మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు ఎప్పుడు ముందుంటారని ఉద్యమాలకు తుటాలకు,లాఠీలకు భయపడరని ఈ ప్రాంతంలో పోడు సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి రావలసి ఉంది వాటి కోసం కూడా సిపిఎం పార్టీ అగ్ర బాగానే ఉండి పోరాటం చేస్తుంది. అంతేకాక రైతాంగ సమస్యలు మహిళా సమస్యలు నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమన్నారు కేంద్రంలో బిజెపి మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు జిల్లాలో ఇటీవల వచ్చిన వరదలకి, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదిగిన వెంటనే పూడ్చి సాగర్ కాలల ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని కాపాడలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లాలో రైతుల పక్షాన ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మహాసభలో పార్టీ నిర్మాణం పై చర్చలు జరిగాయి. ఈ మహాసభలో సిపిఎం పార్టీ తుమ్మలపల్లి నూతన శాఖ కార్యదర్శిగా బొడ్డుపల్లి వీరభద్రం ను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల కుటుంబరావు. పార్టీ మండల నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు. బండారు మల్లయ్య, దుర్గం రామ లక్షలు. జుబ్బూరి వీరభద్రం బోయినపల్లి ప్రసాదు, కొలుపుల నాగమణి, జోగు రమాదేవి, చింతల బసవయ్య తదితరులు పాల్గొన్నారు.