— బొంతు రాంబాబు
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.
నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 24: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
కొణిజర్ల:-దేశ వ్యాపితంగా అడవి జంతువుల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 25 న బుధవారం చలో ఢిల్లీనీ జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ పిలుపునిచ్చారు.
కొణిజర్ల మండలం గద్దల గూడెం గ్రామం లో సిపిఎం గ్రామ మహా సభ సందర్భంగా జరిగిన రైతు సభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ మాట్లాడుతూ పులులు, ఏనుగులు, కోతులు అడవి పందులు, నెమళ్ల వలన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. ఈ అభయ అరణ్యాల దగ్గర సాగు చేస్తున్న రైతుల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయనీ అన్నారు. 2018 నుండి ఇప్పటివరకు దేశంలో పులుల వలన 300 మంది పైగా రైతులు చనిపోయారనీ అన్నారు. ఏనుగుల వలన 2,700 మంది రైతులు చనిపోయారనీ అన్నారు. కోతులు వలన కూడా వందలమంది రైతులు చనిపోయారు వీరికి ఎలాంటి పరిహారం కేంద్ర ప్రభుత్వం నుండి రావడం లేదనీ అన్నారు. పంటలు తీవ్రంగా నష్టపోతున్నారనీ అన్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను పెట్టుబడి పెట్టి, చేతికి వచ్చిన సమయంలో అడవి జంతువుల వల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని అన్నారు. ఈ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల నష్టం తో పాటు మనుషులు కూడా చనిపోతున్నారనీ అన్నారు. కనీస పరిహారం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోతులు అడవి పందులు, నెమళ్ల వలన పంటలనే మార్పిడి చేసుకుంటున్నారనీ అన్నారు. వీటిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఈనెల 25న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ ధర్నాలు రైతాంగం పంటలు దెబ్బతిన్న వాళ్లు, అడవి జంతువుల వల్ల మరణించిన కుటుంబాలు హాజరు కావాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో గద్దల గూడెం మాజీ సర్పంచ్ పుల్లూరి వెంకటేశ్వరరావు, సిపిఎం గ్రామ కార్యదర్శి తేజవత్ సీతారాములు, చల్లా రాములు, చల్లా వెంకటనారాయణ, రేమల్ల కృష్ణ, హనుమంతు, భూ లక్ష్మి , వంశీ, రవి,ఎర్రగాని కృష్ణ కౌసల్య,తదితరులు పాల్గొన్నారు.