రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 24:- రాష్ట్ర మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇంకా అధికార దాహం తీరలేదని,సీఎం కూర్చి పై ఉన్న సోయి సిరిసిల్ల ప్రజలపై లేకపోవడం దురదృష్టకరమని టీపిసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ విమర్శించారు.ఆయన రామాయంపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావు కనబడడం లేదంటూ స్థానిక నియోజకవర్గ ప్రజలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని కేటీఆర్ గమనించాలని అన్నారు.కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పైన విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డికి కుటుంబ పాలన తప్ప ఫామ్ హౌస్ రాజకీయాలు రావని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రజలకు కాంగ్రెస్ పాలననే ఆదరిస్తున్నారని అన్నారు.అదే
బిఆర్ఎస్ పార్టీ నీ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు.హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా మీరు ప్రతిపక్షంలో ఉండి మీ అభిప్రాయాలను ప్రజా సమస్యల గురించి మాట్లాడాలే తప్ప,ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలన్నారు.ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరన్నారు.గత మెదక్ ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు అపజయం పాలు చేసిన సంగతి మరిచిపోయారా అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.