నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఓ మంత్రి ఇంట్లో జరగడం చర్చాంసనీయంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస
రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. ఈ రైడ్స్కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ దాడులతో కంగుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన బంధువులకు సిబ్బందికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుని వాచ్ ల వ్యవహారంతో గతంలోనే చెన్నై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకున్న విషయం విదితమే. పన్ను ఎగవేత, అధిక ఆదాయం కలిగి ఉన్నాడని నేపథ్యంలోనే ఈడి దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.