నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయంలో తహశీల్దార్ సునిత ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి మరియు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా తహశీల్దార్ సునిత మరియు రెవిన్యూ సిబ్బంది ఇరువురి చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ సునిత మాట్లాడుతూ భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించారని అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుందని అన్నారు..అలాగే దేశ స్వాతంత్య్ర పోరాటంలో, ముల్కీ ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి బాపూజీ అని.. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని.. బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది రెవిన్యూ ఇన్స్పెక్టర్ వహీదా సుల్తానా,ప్రసన్న కుమార్,జూనియర్ అసిస్టెంట్ జానీ పాషా,రమాదేవి,అబ్బాస్, ఆర్ఏ కర్ణ, సత్యానందం,రఫీ అటెండర్లు జానీ మియా,హరిక తదితరులు ఉన్నారు.