. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు ఖమ్మం పట్టణంలో 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు మొదలు పెట్టారు బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి వెంకటనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ తాండ్ర వినోద్ రావు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 53వ డివిజన్ లో ప్రతి ఇంటింటికి వెళ్లే మేము పార్టీ సభ్యత్వాలు చేర్పిస్తున్నామని, వికసిత భారత అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు భాగస్వాములు అవ్వాలని, అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే మోదీ లక్ష్యమని, ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా బిజెపి సభ్యత్వాలు పొందుతున్నారని, ఈ సభ్యత్వాల మహా యజ్ఞంలో ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు తమ వంతు బాధ్యత తీసుకొని, బీజేపీ ఎంత శక్తివంతమైనదో అనేది తెలియజేయాలని, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళుతున్నారని, ఈ 53 డివిజన్లో వెంకటనారాయణ యాదవ్, సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాడని,ప్రతి ఇంటి సభ్యుడుల అందరితో కలిసి పోతున్నారని,గత కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసిన వీరు అతి స్వల్పంతో ఓటమి చెందారని, తదుపరి కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ 53 డివిజన్ నుండి గెలిపించుకుంటామని డివిజన్ ప్రజలు అంటున్నారని వారు తెలిపారు,ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, శ్రీజర్ల వెంకటేశ్వర్లు , రాంబాబు సమ్మయ్య, చోటు, కృష్ణ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.